పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి హోలీ శుభాకాంక్షలు తెలిపారు.హోలీ సందర్భంగా కుటుంబ సభ్యులతో,బి.ఆర్.ఎస్.నాయకులతో కలిసి హనుమకొండలోని వారి నివాసంలో సహజ సిద్దమైన రంగులతో జరుపుకున్నారు.ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ సహజ సిద్ధమైన రంగులతో పండుగ జరుపుకోవాలని ప్రజలను కోరారు.ఈ హోలీకి అందరి కుటుంబాల్లో సంతోషాలు వెల్లివిరియాలని చల్లా ధర్మారెడ్డి ఆకాంక్షించారు.కెమికల్స్ కలిగి ఉన్న రంగులను హోలీ పండుగ సందర్భంగా వాడటం వల్ల ఆరోగ్యానికి హానికరం అని సూచించారు.హోలి పండుగ అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి సంతోషంగా సాగాలన్న సందేశాన్ని ఇస్తుందన్నారు. ఈ రంగుల వసంతోత్సవం ప్రజల్లో కొత్త ఉత్తేజాన్ని.. కొత్త శక్తిని శాంతి సౌఖ్యాలు నింపాలన్నారు.ఈ వేడుకల్లో బి.ఆర్.ఎస్.నాయకులు గురిజాపల్లి ప్రకాష్ రావు, నేతాని శ్రీనివాస్ రెడ్డి,దురిశెట్టి చంద్రమౌళి(చందు),సూదాటి వెంకటేశ్వర రావు,చింతం సదానందం,ఎండి జాకీర్ అలీ తదితరులు పాల్గొన్నారు.
