మందమర్రి, నేటిధాత్రి:-
పట్టణానికి చెందిన అన్వేష్ సూర్య తన పుట్టినరోజు సందర్భంగా పేద కుటుంబానికి చేయుతనందించి మానవత్వం చాటుకున్నారు. పట్టణానికి చెందిన తడబాయిన అనసూర్య నిరుపేద కుటుంబానికి అన్వేష్ ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ, అనసూర్య కుటుంబానికి ఎలాంటి ఆపద వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పేద ప్రజలకు సేవ చేయడానికి ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ ఎల్లప్పుడూ ముందుంటుందని, గతంలో కరోనా సమయంలో ఎంతోమందికి సహాయ సహకారాలు అందించమని, కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించడం జరిగిందని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చిన సొసైటీ ఆద్వర్యంలో ఏదో రూపకంగా సహాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ఉపాధ్యక్షుడు సుద్దాల ప్రభుదేవ్, నదిపట రాజు, ఎండి జావిద్ పాషా తదితరులు పాల్గొన్నారు.