శాలువాతో ఘనంగా సత్కారం చేస్తున్న రిటైర్డ్ పోలీసుల అధికారుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు పులి వీరారెడ్డి
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ జనవరి 18
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి ఎస్ఐగా నూతనంగా విచ్చేసి బాధ్యతలను చేపట్టిన తీగల మాధవ్ గౌడ్ ను రిటైర్డ్ పోలీసుల సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు..ముల్కలపల్లి గ్రామ వాస్తవ్యులు పులి వీరారెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందించి..ఘనంగా శాలువాతో సత్కరించి, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో చదువు రమణారెడ్డి పాల్గొన్నారు.