ఎనిమిది గంటల ప్రాంతంలో సంఘటన.
మహాదేవపూర్- నేటి ధాత్రి:
గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో హార్వెస్టర్ యజమాని శ్రీకాంత్ మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన మహాదేవపూర్ మండలంలోని సండ్రుపల్లి గ్రామంలో రాత్రి 7:30 నుండి 8 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది. మృతుడు శ్రీకాంత్ మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలంలోని కుమ్మెర గ్రామవాసి గా గుర్తించడం జరిగింది. మృతుడు వరి కోత “హార్వెస్టర్ మిషన్” యజమాని కావడంతో వరి కోత పనుల నిమిత్తం సండ్రుపల్లి గ్రామానికి రావడం జరిగిందని తెలుస్తుంది. ఇదే క్రమంలో గుర్తుతెలియని వ్యక్తులు శ్రీకాంత్ శరీరంపై అనేకచోట్ల కత్తులతో దాడి చేయడం తో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న కాలేశ్వరం సబ్ ఇన్స్పెక్టర్ చక్రపాణి సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టడం జరిగింది. మరింత సమాచారం కోసం నేటి ధాత్రి సబ్ ఇన్స్పెక్టర్ చక్రపాణి కు వివరణ కోరగా సంఘటనపై దర్యాప్తు కొనసాగడం జరుగుతుందని హత్యకు గల కారణం నిందితులను సాధ్యమైనంత త్వరలో పట్టుకుంటామని తెలిపారు.