అదనపు కట్నం కోసం వేధింపులు..

# కోడలిని సరాతంతో కాల్చిన అత్తమామలు

# పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసిన బాధితురాలు

నర్సంపేట,నేటిధాత్రి :

అదనపు కట్నం కోసం కోడలును సరాతంతో రెండు చేతులపై అత్తమామలు కాల్చిన సంఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. అదనపు కట్నం వేధింపులతో గాయపడిన ఆ మహిళ నర్సంపేట జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి తల్లిదండ్రులు దుగ్గొండి పోలీసులను ఆశ్రయించారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండల కేంద్రానికి చెందిన అడుప కోమలీల,బుచ్చయ్య దంపతుల కుమార్తె నాగరాణిని నెక్కొండ మండలంలోని దీక్షకుంట గ్రామానికి చెందిన జల్లి శారద, బుచ్చయ్య కుమారుడు నరేష్ తో 2017 మార్చిలో వివాహం జరిపించారు.కాగా నరేష్ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు.కట్నం కింద వీరికి ఎకరంనర భూమి,15 తులాల బంగారంతో పాటు రూ.2లక్షలను ముట్టజెప్పారు.వీరికి సంతానం ముగ్గురు కాగా ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.ఇదిలా ఉండగా గత సంవత్సర కాలంగా వీరి ఇద్దరిమధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు బాధితురాలు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.గత కొన్ని నెలల కిందట వరంగల్ లో ఒక ఇల్లుని నరేష్ కొనుగోలు చేశాడు. కాగా ఈ ఇల్లుకు సంబంధించి రూ.40లక్షలు తీసుకురావాలని ఒత్తిడి చేస్తున్నట్లు నాగరాణి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో మూడు నెలల కిందట నరేష్ బెల్ట్ తో కొట్టడంతో నాగరాణి గాయపడింది.దీంతో తన తల్లిగారి ఇల్లు దుగ్గొండికి వెళ్ళింది.ఈ సందర్భంగా పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించిన అనంతరం నాగరాణిని
దీక్షకుంటకు తీసుకువెళ్ళారు. కొన్ని రోజుల అనంతరం నాగరాణి
నిత్యం వేధింపులకు గురైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు.సోమవారం రాత్రి నాగరాణిపై నరేష్ చేయి చేసుకున్నాడు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పడంతో నాగరాణి అత్తమామలు మరింత కోపోద్రిక్తులయ్యారు. మంగళవారం ఉదయం సరాతంతో నాగరాణి చేతిపై కాల్చి, దాడి చేసినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం దీక్షకుంట గ్రామానికి వచ్చిన తన కుటుంబ సభ్యులపై సైతం దాడి చేసినట్లు నాగరాణి తెలిపారు.జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో నాగరాణి చేతులకు గాయాలు కాగా, ఆమె సోదరుడు రఘుకి తలకు గాయమై మూడు కుట్లు పడ్డాయి. ప్రస్తుతం బాధితులు దుగ్గొండి పోలీస్ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించారు.దుగ్గొండి ఎస్సై పరమేష్ మాట్లాడుతూ నాగరాణిని అదనపు కట్నం కోసం వేదింపులకు గురిచేసి గాయపరిచిన భర్త నరేష్,అత్తమామ జల్లి శారద, బుచ్చయ్యలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version