పర్యావరణ పరిరక్షణకొరకై ప్రతి ఒక్కరి బాధ్యత
తాతజీ పరకాల ఎక్సైజ్ సీఐ
శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలంలోని కాట్రపల్లి గ్రామం ప్రజ్వల్ రైతు ఉత్పత్తి దారుల సంఘం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి డెన్స్ ఫారెస్ట్ లో 200 మొక్కలు నాటారు అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కొరకై ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలి. పర్యావరణ పరిరక్షణకు ముఖ్యపాత్ర కేవలం రైతాంగమే వహించాలని అధిక దిగుబడుల సాదించడం కోసం విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు,పురుగుమందులు వాడడం వల్ల వాతావరణ కల్యుషితమై సరైనటువంటి సమయంలో వర్షాలు లేక అనేక ఇబ్బందులకు గురవు తున్నటువంటి కర్షకులు, ప్రజలు పర్యావరణాన్ని పరీక్షించే విధంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని అన్నారు ప్రజ్వల్ రైతు సంఘం పి యు మేనేజర్ గుడిమల్ల మానస చౌదరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి పర్యవరణ పరిరక్షణకు 1973 నుండి ప్రపంచ వ్యాప్తంగా చాలా కార్యక్రమాలు నేల నీరు పర్యావరణం పరిరక్షణ చేయటం జరుగుతుంది. రైతు లందరూ వ్యవసాయ సాగులో వివిధ ఎరువులు, పురుగు మందులు నేలకు అందించడం వల్ల నేల సారం తగ్గి నిస్సాహిత స్థితిలో మారి సరైనటువంటి దిగుబడును సాధించలేక పంటల్లో పురుగుమందులు పిచికారిలా అనంతరం ఆ ఖాళీ డబ్బాలను నీటిలో కడగడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడి ఈ ప్రభావం అంతటి కూడా పర్యావరణం మీద పడి ఆదిక ఉష్ణోగ్రత ఏర్పడి దీనికి ఉదాహరణగా వీస్తున్నటువంటి వడగాలులే దీని గల కారణమని ఉష్ణోగ్రత ఈ సంవత్సరం 45 డిగ్రీలు పెరిగాయని 55 డిగ్రీలు పెరిగిన అధైర్య పడవలసిన పడవలసిన అవసరం లేదు. పర్యావరణం పరి రక్షించే విధంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణం
పరిరక్షించడంలో భాగంగా ప్రతి ఒక్కరు తమ వంతుగా మొక్కలను ఇంటి చుట్టు పరిసరాలలో నాటుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో వన సంరక్షణ సమితి ఫారెస్ట్ అధికారులు రతన్ లాల్, ప్రవీణ్ ప్రజ్వల్ రైతు ఉత్పత్తి దారుల సంఘం సిబ్బంది, సునీల్, తిరుపతి, గౌస్, రవి చందర్ ,భానుమతి తదితరులు పాల్గొన్నారు.