కూకట్పల్లి ఫిబ్రవరి 13 నేటి ధాత్రి ఇన్చార్జి
మా చిన్ననాటి మిత్రుడు తాసిల్దార్ ప్రేమ్ కుమార్ను క్లాస్మేట్ లైన ఆ నాటి కొంత మంది మిత్రులు మంగళవారం నాంపల్లి ఆర్డిఓ కార్యాలయంలోని అతని చాంబర్లో కలిసి పుష్పగుచ్చ మిచ్చి శాలువతో సన్మానించి శుభా కాంక్షలు తెలియజేశాం.ఇటీవల నగరంలో కలెక్టర్ ద్వారా ఎంపికైన బెస్ట్ ఎమ్మార్వోగా ప్రేమ్ కుమార్ ఎన్నిక కావడంతో ఈ సన్మానం చేయడం జరిగింది.అంతకు ముందు అబిడ్స్ లోని అలియా ప్రభుత్వ పా ఠశాల ఫిజికల్ డైరెక్టర్ నర్సింగ్రావు ఆధ్వర్యంలో పాఠశాల భవనంలో ఏర్పాటుచేసిన చిన్న పాటి సమా వేశంలో సుమారు గంటసేపు అల నాటి బాలమిత్రులమైన మేము పూర్వ విద్యార్థులు ఆనాటి తీపి కబురు చెప్పుకుంటూ ఆనంద డోలికలో మునిగి పోయారు.
చిన్నప్పుడు చదువుకున్న అంశాలపై ఒక్కొక్కరి నడవడిక ప్రస్తుతం స్పీడ్ కాలంలో కొనసాగుతున్న విధానము రెండు వ్యత్యాసాలను పరిశీలన చే సి ఆనాటి రోజులే మంచివని ఒక రికొకరు కలుసుకుంటూ ఆలింగణం చేసుకున్నారు.యవన్న దశలో విడి పోయి పలు రంగాల్లో స్థిరపడి నేడు ఐదు పదులు పైచిలుకు దాటినవా రు ఆ రోజుల్లే బాగున్నాయి… డబ్బు లేకపోయినా ఆనందంగా గంటల తరబడి ఒకరి ఇంటి వద్ద ఒకరు గడుపు కుంటూ తాత ముత్తాత లను సైతం పలుకరించిన హరితో అందరితో మర్యాద చనువుగా బుద్ధి బుద్ధిమంతుడిలా కొనసాగుకుంటూ సంస్కారవంతుడిగా మెదిలిన రోజు లు అప్పుడు,ఇప్పుడు కొనసాగుతూ వస్తుంది మనమేననీ నెమరు వేసు కున్నారు.జర్నలిస్టు మారుతికుమా ర్,సంతోష్లు మాట్లాడుతూ…. గురు వు పట్ల గౌరవం భక్తి తల్లిదండ్రుల మాటను జవదాటకుండా ఉంటూ వచ్చిన సంస్కృతిసాంప్రదాయాలను పాటిస్తూ కొనసాగుతున్న మనం నే డు ప్రతి ఒక్కరం మంచి మార్గంలో ఉండడంతోనే నేను ప్రతి ఒక్కరు మంచి ఉద్యోగాల్లోనూ వ్యాపారా లలోనూ ఆనందమైన జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్న తరం కూడా మనదేనని తెలియజేశారు.మళ్లీ మార్చి నెల పదవ తేదీ రోజు పూర్వ విద్యార్థులను పెద్ద ఎత్తున తప్పనిస రిగా కలుసుకునేందుకు హ్యాపీ డేస్ గ్రూప్లో వచ్చిన సమాచారాన్ని చదివి తూచ తప్పకుండా హాజరవుతారని ఆశిస్తున్నట్లు మిగతా మిత్రులు మా ట్లాడారు.కార్యక్రమంలో మా తోటి మిత్రులు యుగేందర్రావు,నిమ్స్ సు రేష్బాబు,మధు,పంజాగుట్ట రమే ష్,విజయ్,అంబర్పేట్ సంతోష్ కుమార్ శివరాంపల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.