బిఆర్ఎస్ పరకాల పట్టణ అధ్యక్షురాలు గంటా కళావతి
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల బిఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు,12వ వార్డు ఇంచార్జ్ గంటా కళావతి పట్టణ మరియు మండల నియోజకవర్గ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ నేటి మహిళలు అన్ని రంగాల్లో తమదైన సత్తాను చాటుతున్నారని ఒకప్పుడు వంటింటికే పరిమితం కాబడిన స్త్రీలు కాలానుగుణ మార్పులకు భిన్నంగా వారికివ్వబడిన హక్కులు సాధించుకునే క్రమంలో మొదట చదువును ఆయుధం చేసుకొని శాస్త్ర సాంకేతిక రంగాలవైపు దృష్టి సారించి వైజ్ఞానిక వేత్తలుగా నూతన ఆవిష్కరణలు చేస్తున్నారని అన్నారు.ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు విద్యావంతులు కాలేకపోవడం బాధాకరమని మహిళలు విద్యాపరంగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా సాంస్కృతికంగా కృషిచేసి సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.అనేకమంది ఉన్నతాధికారులు,రాజకీయనాయకులు ఎక్కువ శాతం మహిళలేనని అందుకు కారణం చదువు,రాజ్యాంగ అందించిన హక్కు అని అన్నారు.