చేర్యాల నేటిధాత్రి..
చేర్యాల పట్టణంలో ఎంత ఉత్సాహంగా పిల్లలు పెద్దలు అంటూ తారతమ్యం లేకుండా కుల మతాలకు అతీతంగా ఎంతో సంబరంగా అందరూ కలిసి హోలీని జరుపుకున్నారు.
హోలీ అనే పదం ఎందుకోచ్చిందంటే.
హోలీ అనేది సంస్కృత పదం. వసంత కాలంలో వచ్చే ఈ పండుగను ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్ లో హిందువులు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకుంటారు.
హిరణ్య కశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు. విష్ణువును పూజించడం మాన్పించేందుకు హిరణ్య కశిపుడు ప్రహ్లాదుణ్ని ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తాడు. చివరిగా తన సోదరి హోలిక అనే రాక్షసిని చితిలో కూర్చోమని చెప్పి, ఆమె ఒళ్లో ప్రహ్లాదుణ్ని కూర్చోమంటాడు. మంటలనుంచి రక్షించే శాలువాను హోలిక ధరించడంవల్ల ఆమెకు మంటలు అంటుకోవు. ఆమె ఒడిలో కూర్చుని ప్రహ్లాదుడు విష్ణువును ప్రార్ధిస్తాడు.
విష్ణు మాయతో ప్రహ్లాదుడు మంటలనుంచి బయటపడతాడు. కానీ శాలువా ఎగిరిపోవడంతో హోలిక ఆ మంటల్లో కాలిపోతుంది. హోలిక దహనమైన రోజుగా హోలీ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో హోలీ రోజున హోలిక పేరుతో ఒక బొమ్మను తయారు చేసి దానికి నిప్పంటించి వేడుక జరుపుకుంటారు. తెలుగునాట కొన్ని ప్రాంతాల్లో హోలికా దహన్ ను కామ దహనం అని కూడా అంటారు.
ప్రత్యేక పూజలు
చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోలీని జరుపుకుంటారు. ఈరోజు ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా తీపి వంటకాలను చేసుకుని ఆరగిస్తారు. దేశ వ్యాప్తంగా హోలీని జరుపుకుంటుున్నారు. తెలంగాణలోనూ రాజకీయ నేతల నుంచి సామాన్య ప్రజలు వరకూ ఈ హోలీ వేడుకలో పాల్గొన్నారు.