వీణవంక, ( కరీంనగర్ జిల్లా)
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో హనుమాన్ మాలధారణ స్వాములు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా మాల ధరించి నిష్ట నియమాలతో స్వామివారిని పూజిస్తారు. హనుమాన్ జయంతి సందర్భంగా గ్రామాలలో హనుమాన్ ఉత్సవ విగ్రహాన్ని రతంలో అసినులై గ్రామంలోని పూరవీధుల గుండా ఊరేగింపు శోభ యాత్ర నిర్వహించారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, అంటూ రామనామ స్మరణ చేసుకుంటూ చేసుకుంటూ డీజే పాటలు, మేళ తాళాల మధ్య స్వాములు నృత్యాలు చేస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ స్వాములు, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

