బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించడం ఖాయం
శాయంపేట నేటిధాత్రి,: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ,వరంగల్ రూరల్ జడ్పీ చైర్పర్సన్&భూపాలపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి మండల బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా గుర్రం అశోక్ నియమిస్తూ, నియామక పత్రాన్ని అందించారు.
ఈ సందర్భంగా గుర్రం అశోక్ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన గండ్ర దంపతులకు,ప్రభుత్వ చీఫ్ విప్ ద్యాసం వినయ్ భాస్కర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.భూపాలపల్లి ఎమ్మెల్యే చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలనూ ప్రజల్లోకి తీసుకెళ్తు మరో మారు బిఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించే దిశగా పనిచేస్తానని తెలియజేశారు. మండలంలో బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో కలిసికట్టుగా ముందుకు సాగుతానని తెలియజేశారు.
నాపై నమ్మకంతో నాఎన్నికకు సహకరించిన ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి ,,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగుల మనోహర్ రెడ్డి , మండల ప్రజాప్రతినిధులకు, అన్ని గ్రామాల సర్పంచులకు, ఎంపీటీసీలకు , బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులకు యూత్ కమిటీ నాయకులకు గండ్ర దంపతుల అభిమానులకు, బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.