భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
మణుగూరు సింగరేణి ఏరియా ఓ. సి 2 నందు డంపర్ సెక్షన్ లో విధులు నిర్వహిస్తున్న గుగులోత్. నగేష్(41) అనుమానస్పద మృతి…విషయం తెలుసుకున్న ఏరియా టి బి జి కె యస్ బ్రాంచి ఉపాధ్యక్షులు నాగెల్లి మణుగూరు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ లో ఉంచిన నగేష్ మృత దేహాన్ని సందర్శించి మృతికి గల కారణాలు వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు… గుండె పోటు వల్ల మరణించాడని మృతుడి భార్య తెలుపుతుండగా మృతుడి భార్య కొట్టి చంపిందని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు…మృతుడికి ఇద్దరు పిల్లలు….పోస్ట్ మాట్ రిపోర్టు అనంతరం వివరాలు తెలియవలసి ఉన్నది… మృతుడు ఇల్లందు వాసి భాగ్యనగర్ తండాకు చెందిన వాడు కావడం వల్ల పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఇల్లందు తీసుక వెళుతున్నట్టు మృతుడు కుటుంబ సభ్యులు తెలిపారు