శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట సర్కిల్ సిఐ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రంజిత్ రావును శుక్రవారం మాజీ సర్పంచ్ కందగట్లరవి ఎంపిటిసి బాసాని చంద్రప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిసి చేనేత వస్త్రాలతో సత్కరించారు. పోలీస్ స్టేషన్ వచ్చే బాధితులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కొత్తగా విధుల్లో చేరిన ఎంపీడీవో ఫణి చంద్రను కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి గజ్జి ఐలయ్య పిఎసిఎస్ డైరెక్టర్ కందగట్ల ప్రకాష్ నాయకులు బాసాని లక్ష్మీనారాయణ బూర కుమారస్వామి పాల్గొన్నారు.