యువతకు చేగువేరా ఆదర్శం
శాయంపేట నేటిధాత్రి;
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో చేగువేరా యువత ఆదర్శంగా తీసుకోవాలని పూలె యువజన సంఘం ఆధ్వ ర్యంలో చేగువేరా జయంతి వేడుకను ఘనంగా నిర్వహిం చడం జరిగింది. పూలె యువజన సంఘం అధ్యక్షులు పిట్టల వికాస్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళు లర్పించారు.అనంతరం వికాస్ మాట్లాడుతూ అమెరికా దేశంలో దృఢంగా ఉన్న ఆర్థిక తారతమ్యాలు, ఏకస్వామ్య పెట్టుబడిదారీ వ్యవస్థ, నూతన వలసవాదం, సామ్రాజ్య వాదము పైన పోరాడిన పోరాట యోధుడే చేగువేరా అన్నారు.చేగువేరా ప్రపంచ విప్లవకారుడని ప్రతి ఒక్కరు హక్కులకోసం చేగువేరాలా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూలె యువజన సంఘం నాయకులు చందు, సాయి మనోజ్, బాలరాజు, సన్నీ, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.