హసన్ పర్తి / నేటి ధాత్రి
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం అహర్నిశలు పోరాడిన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ 39 వ వర్ధంతి వేడుకలు వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ పరిధిలోని 65 వ డివిజన్ దేవన్నపేట లో ఘనంగా జరిగాయి. శ్రీ మడేలేశ్వర రజక సంఘం అధ్యక్షులు పోలేపల్లి సాంబయ్య ఆద్వర్యంలో డివిజన్ కార్పొరేటర్ గుగులోతు దివ్యారాణి రాజు నాయక్ హాజరై చాకలి ఐలమ్మ కి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కుల పెద్దలు పోలేపల్లి రాజు (మైకేల్) సదానందం, భీమయ్య, కుమారస్వామి చంద్రశేఖర్, కర్ణాకర్, ఐలయ్య, నాగరాజు మరియు ఆత్మ డైరెక్టర్ పంజాల భూపాల్ గౌడ్, మాజీ సర్పంచ్ చుంచు రవి, పిఎసిఎస్ డైరెక్టర్ చుంచు విజేందర్, 65 వ డివిజన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలేపాక అశోక్, మాదిగ జర్నలిస్టు ఫోరం హన్మకొండ జిల్లా అధ్యక్షులు సందెల రాజు, కలకోటి సుధాకర్, అయ్యల సాంబరెడ్డి, సూరం రాజు, చింత నవీన్, గాడిపెల్లి సతీష్, ఆవుల రాజేంద్రప్రసాద్, అఖిలేష్, నాగరాజు, కర్నాకర్, ఐలయ్య మరియు తదితరులు, గ్రామస్తులు పాల్గొన్నారు. అనంతరం అందరికీ పండ్లు పంచి పెట్టారు.