తెలంగాణ జాతిపిత కేసిఆర్.
మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు.
మరిపెడ ,ఫిబ్రవరి 17, నేటిధాత్రి:
భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ సీఎం కే చంద్రశేఖర్ రావు 70 వ జన్మదిన వేడుకలు శనివారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలో మహబూబాబాద్ జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడిపుడి నవీన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కేసిఆర్ జన్మదినం సందర్భంగా మొక్కలు నాటారు రోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేశారు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో కేసీఆర్ పట్టువదలని విక్రమార్కుడుగా పోరాడారని, తెలంగాణ సాధించడంతో తెలంగాణ జాతిపితగా అభివర్ణించుకుంటున్నామని అన్నారు. కెసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని వచ్చే వచ్చే ఐదు సంవత్సరాలు మన ప్రభుత్వమే వస్తుందని కార్యకర్తలు అధైర్య పడద్దన్నారు రాబోయే మంచి రోజుల కోసం ప్రతి కార్యకర్త కష్టపడి పార్టీ కోసం పనిచేయాలని అధినేత ఆదేశాలను పాటిస్తూ పార్టీకి వెన్నుదన్ను ఉండాలని పిలుపునిచ్చారు,ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు, మక్సుదు, దుస్స నరసయ్య, మైనారిటీ నాయకులు లతీఫ్, యూత్ నాయకులు, అజ్మీరా రెడ్డి, మహిపాల్ రెడ్డి,గంధసిరి కృష్ణ, బోడ భాస్కర్ బిఆర్ఎస్ శ్రేణులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.