మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి
కేంద్రంలో భూపాలపల్లి యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రెసిడెంట్
యారా అజయ్ రెడ్డి మాట్లాడుతూ01 -11-2020 వరకు డిగ్రీ పూర్తి చేసిన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటర్ కార్డును నమోదు చేసుకోవాలని గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసినా పట్టభద్రులు కూడా మళ్ళీ తహశీల్దార్ కార్యాలయంలో కావాల్సిన పత్రాలు సమర్పించి ఓటర్ కార్డును నమోదు చేసుకోవాలని కోరారు. తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రక్రియ త్వరలో రానున్న సందర్బంగా భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న డిగ్రీ పట్టభద్రులు (సోదర, సోదరీమణులు) విద్యార్థి, విద్యార్థినులు త్వరగా ఎమ్మెల్సీ ఓటును నమోదు చేసుకుని, ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అలాగే ఓటు హక్కును అందరూ సద్వినియోగపరుచుకోవాలి అని కోరారు. ఎమ్మెల్సీ ఓటర్ గా నమోదు చేసుకోవడానికి కావాల్సిన పత్రాలు ఆధార్ కార్డు, డిగ్రీ ప్రోవిషనల్ సర్టిఫికెట్ జీరాక్స్, ఓటర్ ఐడి జీరాక్స్, పాస్ ఫోటో ముఖ్యంగా 2020 నవంబర్ 1 తేది నాటి కంటే ముందే డిగ్రీ పాస్ అయి ఉన్నవారే అర్హులని కాబట్టి అర్హులైన ప్రతి ఒక్కరు ఫిబ్రవరి 6 లోపు ఓటర్ గా నమోదు చేసుకోవాలి అని కోరారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న యూత్ కాంగ్రెస్ నాయకులు తాళ్ళ మహేష్ , చంద రాజ్ కుమార్, లడే శివాజీ మరియు వర్దెల్లి నవనీత్ రావు