# మోకుదెబ్బ రమేష్ గౌడ్ పిలుపు
నల్లబెల్లి,నేటిధాత్రి :
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొని విజయంసాధించి గౌడ కులస్తులు తమ సత్తాచాటాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకుదెబ్బ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనంతుల రమేష్ గౌడ్ పిలుపు నిచ్చారు. నల్లబెల్లి మండల కేంద్రం లోని శ్రీ కంఠ మహేశ్వర ఆలయం ఆవరణలో మోకుదెబ్బ డివిజన్ కమిటీ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన మండల కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా మోకుదెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్,జిల్లా అధ్యక్షులు గోపగాని వెంకట్ గౌడ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ గౌడ కులస్తులు రాజకీయాలకు అతీతంగా తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యత చాటాల్సిన అవసరం ఎంతయినా ఉందన్నారు.ఎన్నికల సమయంలో కుల సంఘం నిర్ణయానికి కట్టుబడి తమ సామాజిక అభ్యర్థులను గెలిపించుకోవాలని సూచించారు. మండలంలోని అన్ని గ్రామాలలో మెజారిటీ కులస్తులు గౌడ సామాజిక వర్గం ఉంది కావున అగ్ర వర్ణాలా ఉచ్చులో పడకుండా మన ఓట్లు మనమే వేయించుకోవాలన్నారు.సర్పంచ్, ఎంపిటిసి, జెడ్పిటిసి, ఎంపీపీ, సొసైటీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలిపించుకొని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పౌరుషాన్ని గౌడ కులస్తులు చూపెట్టాలని రమేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమం లొ మోకుదెబ్బ రాష్ట్ర కార్యదర్శి మద్దెల సాంబయ్య గౌడ్,జిల్లా కార్యదర్శి కొండి రాము గౌడ్, నాతి రాజేంద్ర ప్రసాద్ గౌడ్, సట్ల రమేష్ గౌడ్, మేడపల్లి ఐలయ్య గౌడ్, చుక్క సాంబయ్య గౌడ్, తడుక బీం గౌడ్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.అనంతరం మోకుదెబ్బ మండల కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది. మండలం అధ్యక్షులుగా మేడిపల్లి రాజు గౌడ్,గౌరవ అధ్యక్షులు గా కోటగిరి నారాయణ గౌడ్, ఉపాధ్యక్షులుగా పెరుమాండ్ల శ్రీనివాస్ గౌడ్ కోశాధికారి గా ముత్యాల కుమార్ గౌడ్, డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మచ్చిక రవి గౌడ్,కార్యవర్గ సభ్యులుగా నాగపూరి సాగర్ గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు కమిటీ డివిజన్ అధ్యక్షులు కందుల శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.