సిపిఎం జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి……
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరన్న…..
చేర్యాల నేటిధాత్రి….
చేర్యాల మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆక్రమించిన ప్రభుత్వ భూధాన్ సీలింగ్ భూములను ప్రభుత్వానికి అప్పగించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి అందే బీరన్న లు డిమాండ్ చేశారు. బుధవారం రోజున స్థానిక షాదీఖానాలో ప్రింట్ మీడియా ఎలక్ట్రాన్ మీడియా ప్రతినిధులతో కొంగరి వెంకట్ మావో అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఆముదాల మల్లారెడ్డి, అందే బీరన్న మాట్లాడుతూ కొమ్మూరి ప్రతాపరెడ్డి చేర్యాల ప్రాంతంలో సాధారణ సన్నా చిన్న కారు రైతులకు భూములు అమ్ముకోవద్దు భవిష్యత్తులో అత్యధికమైన ధర పలుకుతుందని హితవు పలుకుతూనే మన చేర్యాల ప్రాంతంలో వందల ఎకరాలు భూములను రైతులకు మాయమాటలు చెప్పి తన పేరున తన కుటుంబ సభ్యుల పేరున పట్టాలు చేయించుకున్నాడని ఇందులో సుమారు 30 ఎకరాల ప్రభుత్వ సీలింగు,
భూదానుభూములను సైతం తన ఆధీనంలో ఉంచుకొని రైతుల ను అదిరించి బెదిరించి మాయమాటలు చెప్పి ఈ భూములను రెవెన్యూ అధికారులను సబ్ రిజిస్టర్ అధికారులను ప్రలోభ పెట్టి రికార్డులు మార్పించి పట్టా భూములుగా మార్చుకోవడం జరిగిందని ఇందుకు ఉదాహరణగా చేర్యాల పట్టణ శివారుకు సంబంధించి 1030 సర్వే నంబర్లో 7 ఎకరాల ఒక గుంట భూధాన్ సీలింగ్ భూమిని ఆక్రమించుకున్నాడని ఆక్రమించుకోవడమే కాకుండా స్థానిక అధికారులను లోబర్చుకొని తన ఇష్టారాజ్యంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని భూదాన్ సీలింగ్ భూమిని పట్టా భూమిగా మార్చుకున్న ఘనుడు కొమ్మూరి ప్రతాప రెడ్డి గారిని, అదేవిధంగా ముస్త్యాల, రేబర్తి, లద్నూరు బంజారా గ్రామాల శివారులలో భూములను ఆక్రమించాడని, మరియు చేర్యాల పట్టణంలో 984, 985, 987 సర్వే నంబర్లలో నిబంధనలను తుంగలో తొక్కి వెంచర్ చేసి ప్రజల అవసరాలకు గుడి బడి ఆటస్థలాలకు మున్సిపాలిటీకి ఏమాత్రం భూమిని వదిలిపెట్టకుండా ప్లాట్లు చేసి అమ్ముకోవడం జరిగిందని ఈ సర్వే నంబర్లలో తన పెట్రోల్ పంపు పక్కన ఖాళీగా ఉన్న భూమిని వెంటనే చేర్యాల మున్సిపాలిటీకి అప్పగించాలని ఈ భూమిని ఇతరులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నాడని దీనిని చేర్యాల మున్సిపాలిటీ అధికారులు నిలుపుదల చేయాలని ఇందులో ఎలాంటి పర్మిషన్లు ఇవ్వకుండా చూడాలని అదేవిధంగా చేర్యాలకు కూత పెట్టు దూరంలో గల బీడీ కాలిని, వావిళ్ళ వంపు సమీపంలో 1030 సర్వే నంబర్లు ఏడెకరాల ఒక గుంట భూదాన్ సీలింగ్ భూమిని భూదాన్ సీలింగ్ నిబంధనలకు విరుద్ధంగా పట్టా చేయించుకొని అనుభవిస్తున్న కొమ్మురి ప్రతాపరెడ్డి ఈ భూమికి పట్టాదారుగా అర్హత లేదని, ఈ భూములను ఇతనే స్వచ్ఛందంగా ప్రభుత్వానికి అప్పగించాలని లేనిపక్షంలో రెవెన్యూ అధికారులు ఈ భూముల రికార్డుల నుండి ఇతని పేరును తొలగించి వెంటనే ప్రభుత్వం స్వాధీనపరుచుకోవాలని కోరడం జరిగింది లేనిపక్షంలో చేర్యాల ప్రాంత సిపిఎం పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఇతర పార్టీలను ప్రజాసంఘాలను కలుపుకొని కొమ్మూరి ప్రతాపరెడ్డి ఆక్రమించిన భూములపై నిజనిర్ధారణ కమిటీ ద్వారా పరిశీలన చేయించి ఈ భూములను ప్రభుత్వ, ప్రజా అవసరాలకు ఉపయోగించుకునే విధంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ టౌన్ కార్యదర్శి పోలోజ్ కుమారస్వామి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఆలేటి యాదగిరి, బండ కింది అరుణ్ కుమార్, టౌన్ కార్యదర్శి రాళ్ల బండి నాగరాజు సిపిఎం టౌన్ కమిటీ మండల కమిటీ సభ్యులు ఆముదాల నర్సిరెడ్డి, ముస్త్యాల ప్రభాకర్ పోలోజు శ్రీహరి, రాళ్ల బండి భాస్కర్, బోయిని మల్లేశం, ఎర్ర బాస్ అశోక్, ఆముదాల రంజిత్ రెడ్డి, దర్శనం రమేష్, ఎన్ కనకయ్య, స్వర్గం శ్రీకాంత్, గర్నపెల్లి చంద్రం తదితరులు పాల్గొన్నారు.