గొల్లపల్లి నేటి ధాత్రి:
గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నదని నీళ్లు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ప్రభుత్వ విప్, ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు విషయం తెలుపగా వెంటనే స్పందించి బోర్ మిషన్ పంపించి నీటి సమస్య తీర్చిన ప్రభుత్వ విప్ కు గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ చిర్ర గంగాధర్, మాజీ ఉప సర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్, ఓర్పుల లచ్చన్న, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు సాన రవీందర్, సంకట చంద్రశేఖర్, ఓర్పుల రవి, సిద్దుల భూమయ్య, శ్రీరాముల మల్లయ్య, అందే సత్యనారాయణ, జాలిగాం నరేష్, సోనా పెళ్లి మహేష్, గ్రామ పెద్దలు సంకటి రాజేశం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.