చిట్యాల, నేటి ధాత్రి :
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్- పాఠశాల ఆవరణలో రాష్ట్రస్థాయి చెకుముకి టాలెంట్ టెస్ట్ కు ఎంపికైన సాదా.సంజయ్10 వ తరగతి, సరిగొమ్ముల .హర్ష 9 వ తరగతి,సాదా.సునీల్ 8 వ తరగతి విద్యార్థులను మండల విద్యాధికారికోడెపాక రఘుపతి అభినందించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విద్యార్థులు పాఠశాల స్థాయి, మండల స్థాయి, మరియు జిల్లాస్థాయిలో అసాధారణ ప్రతిభను ప్రదర్శించి, రాష్ట్రస్థాయికి సైతం ఎంపిక కావటం, గొప్ప విషయమని కొనియాడారు.ఈ విద్యార్థులు మరిన్ని విజయాలు అందుకోవాలని ఆకాంక్షించారు. మిగతా విద్యార్థులు వీరిని ఆదర్శంగా తీసుకుని తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు శ్రీరామ్ రఘుపతి, శనిగరపు భద్రయ్య, బొమ్మ రాజమౌళి, శంకర్, రామ్ నారాయణ,, సదయ్య, ఉస్మాన్ అలీ, సరళ, విజయలక్ష్మి, కల్పన, నీలిమ, సుజాత, రాజు, బుజ్జమ్మ, భాస్కర్, తదితరులుపాల్గొన్నారు..