తీగల శ్రీనివాస్ రావు
మహాత్మా జ్యోతిరావు
ఫూలే జాతీయ అవార్డ్ గ్రహీత
మంచిర్యాల నేటి ధాత్రి
ఎస్సి,ఎస్ టి, బి సి, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన ఓ సి అభ్యర్థులకు అన్యాయం చేసే విదంగా తెచ్చినటువంటి జి ఓ నెం:29 ని వెంటనే రద్దు చేయాలని మహాత్మా జ్యోతిరావు ఫూలే నేషనల్ అవార్డ్ గ్రహీత తీగల శ్రీనివాస్ రావు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి కి ,సుప్రీం కోర్టు తీర్పు కు వ్యతిరేకంగా ఉన్న ఉన్న జి ఓ 29 ని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని మీడియా సమావేశంలో తెలిపారు.ఎస్సి, ఎస్ టి, బి సి, మైనార్టీ, ఈ డబ్ల్యు ఎస్, అభ్యర్థులకు అన్యాయం చేసే విదంగా ఉన్న జి ఓ నెం:29 ని రద్దు చేసి అందరికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జనాభా ప్రాతిపదికన ఉండవాలిసిన రిజర్వేషన్లను తుంగలో తొక్కి అతి తక్కువ శాతం ఉన్న ఓ సి లకు ఎక్కువ శాతం రిజర్వేషన్లను కల్పించి ఇప్పటికే ఎస్ సి, ఎస్ టి, బి సి, మైనార్టీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయం చేశారని అన్నారు.ఎప్పటి కైనా ప్రభుత్వం పునరాలోచించి జి ఓ నెం:29 ని వెంటనే రద్దు చేయలని తీగల శ్రీనివాస్ రావు కోరారు.