కడియం శ్రీహరి
చిల్పూర్ (జనగాం) నేటి ధాత్రి
జనగామ జిల్లా స్టేషన్ ఘనాపూర్ కేంద్రంలోని చిల్పూర్ మండలం పల్లగుంట గ్రామంలో దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆత్మీయ సమ్మేళనం సమావేశం నిర్వహించారు.
అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మిమ్మల్ని అందరిని కడుపు నిండినట్టుగా ఉన్నది
మీ అందరినీ చూస్తుంటే స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో గెలుపు నల్లేరులపై నడకే నన్నారు. గతంలో కరువు ప్రాంతంగా ఉన్న స్టేషన్గన్పూర్ నియోజకవర్గం సాగునీరుకు సాగు త్రాగునీరుకు కరువుతోన్న ప్రాంతం కెసిఆర్ తెలంగాణ మద్రి. రానున్న అసెంబ్లి ఎన్నికల్ల ఎం”సారి అవకాశం ఇవ్వండి నియోజకవర్గ అభివృద్ధిలో కడియం మార్క్ చూపిస్తానని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు.
గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు పల్లగుట్ట గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలందరు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సమస్యను పరిష్కరించుకున్నామని అన్నారు.
కెసిఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసి రైతును రాజును చేయాలనే లక్ష్యంతో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేశారని పేర్కొన్నారు. కళ్యాణ లక్ష్మి, శాదీముబారక్, కెసిఆర్ కిట్టు, అమ్మఒడి, ఆసరా పింఛన్లు, రైతుబంధు, రైతు భీమా వంటి పథకాలను అమలు చేసి తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచినట్లు తెలిపారు. అవినీతి, స్కాంలతో పేరుకుపోయిన కాంగ్రేస్ పార్టీ తరిమి కొట్టాలన్నారు. రానున్న ఎన్నికల్లో ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపించాలని నీతి నిజాయితీతో పని చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొట్టు మానస, చిర్ర నాగరాజు గౌడ్, డాక్టర్ పేరాల సుధాకర్, సంపత్ రాజు, వేల్పుల గట్టయ్య, చల్లారపు శ్యామ్ సుందర్, రవీందర్, జీడి ఆనందం, ఎల్లయ్య, రవీందర్, గోపాల్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ నేతలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.