డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
కొత్తగూడెం టౌన్. బుధవారం బాబు క్యాంప్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అంతర్జతీయ బాలిక దినోత్సవం సందర్భంగ న్యాయ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పి.నిరంజన్ రావు ముఖ్య అతిధి గ పాల్గోని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగ తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవ అధికార సంస్థ హైదరాబాద్ వారి ఆదేశాల మేరకు చైల్డ్ మ్యారేజ్ ప్రతిజ్ఞను విద్యార్థుల చేత చదివించారు.బాలికలు ఆత్మవిశ్వాసంతో ఎదగాలని, ఏ చిన్న సమస్య ఎదురైన జీవితం లో సవాల్ గా తీసుకోవాలన్నారు.. . ప్రపంచవ్యాప్తంగ ఆడబిడ్డలపై ఉండే వివక్షతను, హింసను, బాల్యవివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన కల్పించేందుకు ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బాలికలను విద్యావంతులను చేసి వాళ్ల అభ్యున్నతి కొరకు పాటుపడాల్సిన బాధ్యత ను తీసుకోవాలని తెలిపారు. ఇంట్లో అమ్మా నాన్నలకు, పాఠశాల లో ఉపాధ్యాయుల కు సమస్యలను చెప్పుకొవలన్నారు. గుడ్ టచ్ మరియూ బ్యాడ్ టచ్ లను గురించి బాలికల కు వివరించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల హెడ్మాస్టర్ నీరజ అధ్యక్షత వహించారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం. నీరజ, న్యాయవాదులు రాజమల్లు, జి.సునంద, అసిస్టెంట్ డిఫెన్స్ కౌన్సిల్స్ జ్యోతి విశ్వ కర్మ,జి.నాగ స్రవంతి,మండల విద్యాశాఖ అదికారి జుంకిలాల్ , ఉపాధ్యాయులు షేక్ దస్తగిరి, రమాదేవి చందర్ రావు, రమేశ్ ఉషారాణి, పారా లీగల్ వాలంటీర్స్ బి. రాజమణి, ఇమామ్ పాల్గొన్నారు.