గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు గణపురం మండల కేంద్రానికి చెందిన కత్తెర సుగుణ, సాంబయ్య దంపతులు సత్యనారాయణ స్వామి పీఠం ను బహుకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయానికి సత్యనారాయణ స్వామి పీఠం అందజేసిన సుగుణ, సాంబయ్య దంపతులకు కోటగుళ్ళు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.