సుధాకర్ కుటుంబానికి ఆర్థిక సహాయం
మందమర్రి, నేటిధాత్రి:-
అనారోగ్యంతో బాధపడుతూ, ఉన్న ఇల్లు కూలిపోయి, నిలువ నీడ లేకుండా బాధపడుతున్న గుజ్జ సుధాకర్ కుటుంబానికి సింగరేణి ఏరియాలోని ఆర్కెపి ఓసిపి ఉద్యోగులు అండగా నిలిచి, ఔదార్యం చాటారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కె 4 గడ్డ ప్రాంతంలో నివసించే గుజ్జ సుధాకర్ గత ఆరు సంవత్సరాలుగా పక్షవాతంతో బాధపడుతుండగా, వారు నివసించే ఇల్లు సైతం ఇటీవల కూలిపోయింది. విషయం తెలుసుకున్న ఓసిపి అధికారులు, ఉద్యోగులు మానవతా దృక్పథంతో బుధవారం సుధాకర్ సతీమణి గుజ్జ మధునక్క కు 18 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓసిపి ప్రాజెక్ట్ అధికారి ఎం గోవిందరావు, మేనేజర్ సిహెచ్ వెంకటేశ్వర్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పి మహీంధర్, ఏఐటీయూసీ రామకృష్ణాపూర్ బ్రాంచ్ కార్యదర్శి ఏ ఆంజనేయులు, ఓసిపి అధికారులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.