జైపూర్, నేటి ధాత్రి :
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన బొంగోని రమేష్ గౌడ్ అనబడే గీత కార్మికుడు శనివారం రోజున ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి కింద పడి మృతి చెందడం జరిగింది. కిష్టాపూర్ గ్రామానికి చెందిన బొంగోని రమేష్ గౌడ్ గీత కార్మికుడిగా తన కులవృత్తిని చేస్తూ జీవనం గడిపేవాడు. రోజువారీ గానే శనివారం సాయంత్రం తాటి చెట్టు ఎక్కిన క్రమంలో ప్రమాదవశాత్తు మోకు జారీ కింద పోవడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. వెంటనే మంచిర్యాలలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గంలో మరణించాడు. మృతునికి భార్య, కుమార్తె,కుమారుడు ఉన్నారు.