విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ మురళి
#నెక్కొండ , నేటి ధాత్రి:మండల కేంద్రంలోని గౌతమి విద్యానికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో టాపర్ గా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ అనంతుల మురళీధర్, ప్రిన్సిపల్ కల్పనలు తెలిపారు. మంగళవారం నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ సంబురాలలో భాగంగా నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రైవేట్ పాఠశాలల విభాగంలో గౌతమీ విద్యానికేతన్కు చెందిన ముగ్గురు విద్యార్థుల బృందం ప్రథమ స్థానంలో నిలిచారు. పాఠశాల విద్యార్థులు బి సహజల్ యోధన్ శాస్త్రి ,జే స్వరన్ కుమార్ ,కె విశాల్ యాదవ్ లను పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనంతుల కల్పన , కరస్పాండెంట్ మురళీధర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దయాకర్, మధుకర్ రెడ్డి ,అజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.