కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. నేటిధాత్రి…
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం ఎంపీపీ రేగా కాళికా ఆధ్వర్యంలో సర్పంచుల పదవీకాలం ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మండలంలోని సర్పంచులు మరియు మండల నూతన స్పెషల్ ఆఫీసర్లకు మరియు గ్రామపంచాయతీ సెక్రటరీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించి అనంతరం వారిని ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ రేగా కాలిక మాట్లాడితే ఐదు సంవత్సరాల ప్రజాసేవలో పాలుపంచుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అదేవిధంగా పంచాయతీలోని స్పెషల్ ఆఫీసర్లు విజయవంతంగా గ్రామాల అభివృద్ధిలో పాలుపంచుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండలం ఎంపీడీవో శంకర్, ఎంపీ ఓ ఆఫీస్ స్టాప్ మరియు సెక్రెటరీ స్పెషల్ ఆఫీసర్లు, సర్పంచులు ఉప సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు