పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ వేడుకలు
అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న పూర్వ విద్యార్థులు

తిగుల్ నేటిదాత్రి

తీగుల్ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన 1998- 99 వ సంవత్సర బ్యాచ్ కి చెందిన పూర్వ విద్యార్థిని విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం సిల్వర్ జూబ్లీ వేడుకలను గణేష్ పల్లి లోని ఒక గెస్ట్ హౌస్ లో ఘనంగా ఒక పండగ వాతావరణం లో జరుపుకున్నారు వారికి చదువు చెప్పిన గురువులు మధుసూదన్ రావు వెంకటేశం గార్లను పిలిచి వారిని శాలువాతో మెమెంటుతో సత్కరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు అప్పటి జ్ఞాపకాలు స్నేహాలను చిగురించుకొని వేదిక వద్ద ఉత్సాహంగా అందరూ పాలుపంచుకొని ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని విజయవంతంగా జరుపుకున్నారు అదేవిధంగా ఈ పూర్వ విద్యార్థుల్లో చాలామంది నేడు వివిధ ఉన్నతమైన ఉద్యోగాల్లో స్థిరపడి ఇంకొంతమంది రాజకీయ వ్యాపార సామాజిక రంగాల్లో ఇప్పటికే స్థిరపడి ఉన్నారు, ఈ సందర్భంగా చదువు చెప్పిన గురువులు మాట్లాడుతూ ఇలా అందరు కలవడం మీరు అందరూ మమ్మల్ని ఆహ్వానించడం మాకు సంతోషం ఆనందం వ్యక్తం చేశారు పూర్వ విద్యార్తులు మాట్లాడుతూ మాకి ఉన్నత స్థాయి ఇచ్చినటువంటి గురువులకి ఏమిచ్చినా గురువు యొక్క రుణం తీర్చుకోలేనిదని మాకు విద్యా నేర్పిన గురువుల వల్లే మేము ప్రస్తుతానికి స్థాయిలో ఉన్నామని ఇలా మనమందరం కలవడం చాలా సంతోషం గా ఉందని అలాగే ఇంకా కొంతమంది పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ వారి యొక్క జీవిత విశేషాల్ని తోటి మిత్రులతో వారి వారి భావాల్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ ఎర్రబాగు అశోక్, వలబోజు రాఘవేందర్ శ్రీనివాస్ నవీన్ చేబర్తి సత్యం కీర్తి రాములు ఈశ్వర్ మాణిక్యం సురేష్. రవీందర్ రెడ్డి నరసింహులు రమేష్ ఆంజనేయులు బిక్షపతి సురేష్ పూసల ఆంజనేయులు మైపాల్ రెడ్డి కుమార్ రాజు దేశమత్ రెడ్డి కనకయ్య సంజీవరెడ్డి హరి శంకర్ రెడ్డి రాజయ్య పర్వతం మల్లేష్ కొత్త శ్రీనివాస్ రవి కొండల్ రెడ్డి కర్ణాకర్ రెడ్డి విజయ్ మహిళలు భాగ్యలక్ష్మి ఉమారాణి గాయత్రి మౌనిక మయూరి సౌమ్య కరణమేరి సక్కుబాయి మయూరి అర్చన సంధ్య సునీత మరియు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version