యన్మన్ గండ్ల గ్రామంలో గావ్ చలో (పల్లెకు పోదాం)

ముఖ్యఅతిథిగా రాష్ట్ర బీజేపీ కోశాధికారి బండారి శాంత కుమార్.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

రెండు రోజులు గా మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం లోని యన్మన్ గండ్ల గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షులు గవిండ్ల రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గావ్ ఛలో (పల్లెకు పోదాం) కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బిజెపి కోశాధికారి బండారి శాంత్ కుమార్ పాల్గొనడం జరిగింది.
ఈ సందర్భంగా శాంత కుమార్ మాట్లాడుతూ,
గ్రామాలలో ఎక్కడ చూసిన బిజెపి ప్రభుత్వం ఇచ్చిన నిధులతో జరిగిన అభివృద్దే తప్పా గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వాలు అబద్దాలతో మోసాలతో తెలంగాణ ప్రజలను ముంచుతున్నరు.
కేంద్ర ప్రభుత్వం ప్రతి పథకంలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు..

50 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరిపించడం తో కోవిడ్ సమయంలో 500 రూపాయల ఫ్రీగా ఇవ్వడం జరిగింది పింఛన్లు నేరుగా అకౌంట్ లోకి వేయడం జరుగుతుంది.

బూత్ కమిటీ సమావేశంలో సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ నరేంద్ర మోడి నాయకత్వంలో బలమైన భారతం నిర్మాణంలో అభివృద్ధి పథంలో ముందుకెళుతున్నది అన్నారు.

బూత్ అధ్యక్షులు గ్రామాల్లో ప్రతి ఇంటి కి వెళ్లి కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరించాలని అన్నారు..

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాలుగు కోట్ల పైగా ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు చేశారని అన్నారు..

మహిళలకు ఉజ్వల గ్యాస్ పథకం ద్వారా 10 కోట్ల పైగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చారని చట్టసభలో 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని అన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మధ్యతరగతి కుటుంబాలకు లబ్ధి చేకూరే ఏవిధంగా భారత్ రైస్ 29 రూపాయల కు కిలో బియ్యం, 60 రూపాయలకు కిలో పప్పు అందజేస్తున్నారు.

ముద్ర లోన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లు, ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షలు రూపాయలతో ఉచిత వైద్యం, ఉపాధి హామీ పథకం 100 రోజులను 150 రోజులకు పెంచారని, గ్రామీణ ప్రాంతంలో రోడ్లు వీధిలైట్లు వైకుంఠధామలు రైతు వేదికలు అనేక అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వల్లనే సాధ్యమని అన్నారు.

>మళ్లీ మోడీ గెలిస్తే ప్రపంచంలో

 నంబర్ వన్ స్థానానికి భారత్

>రాష్ట్రంలో పథకాల అమలుకు

 కేంద్ర ప్రభుత్వానివే ఎక్కువ నిధులు

> బిజెపి రాష్ట్ర కోశాధికారి
 శాంత కుమార్

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రపంచంలో ఆర్థికంగా 12వ స్థానంలో ఉన్న భారతదేశం
మోడీ హయాంలో ఏడవ
స్థానానికి చేరుకున్నదని, మళ్లీ మూడోసారి మోడీ ప్రధానమంత్రిగా అయితే ప్రపంచంలో ఆర్థికంగా దేశం నంబర్ వన్ స్థానంలో నిలుస్తుందని బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంత కుమార్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని యన్మన్ గండ్ల గ్రామంలో తమ పార్టీ నాయకులు ప్రతాప్ రెడ్డి, గవింన్లరాజు, రమేష్, ప్రకాష్, సురేష్, బాబు లతో కలిసి గావ్ చలో, ఘర్ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
దేశం గణనీయమైన అభివృద్ధి సాధించిందని అన్నారు. ప్రస్తుతం దేశంలో మోడీ గాలి వీస్తోందని, మళ్లీ మూడవ సారి కూడా ఆయనే ప్రధానమంత్రిగా ఎన్నికై హ్యాట్రిక్ సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్నే మళ్ళీ కోరుకుంటున్నారని ఈసారి బిజెపి దేశంలో 400 లకు పైగా
సీట్లు గెలుచుకుంటుందని, రాష్ట్రంలో కూడా 12 కు పైగా స్థానాలను గెలుచుకుంటుందని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వమే అధికంగా నిధులు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో అమలు చేస్తున్న పథకాలన్నింటినీ తమ ప్రభుత్వమే అమలు చేస్తున్నట్లు ప్రజలలో భ్రమలు కల్పించి రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మన్ననలు పొందాలని ప్రయత్నిస్తుందని ఆయన విమర్శించారు. దేశ ప్రజలకు
ఈ విషయం గురించి వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వాల నిగ్గు తేల్చాలనే పార్టీ అధిష్టానం గావ్ చలో, ఘర్ చలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, అందులో భాగంగానే తాము ప్రతిరోజు గ్రామాలలో పర్యటనలు చేస్తూ గ్రామాలలోనే ప్రజలతోపాటు రాత్రిళ్ళు గడిపి వారి సమస్యలు తెలుసుకుంటూ, వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ బిజెపి అభ్యర్థిగా తానే పోటీలో నిలువబోతున్నానని తనకే ప్రధానమంత్రి మోడీ ఆశీస్సులు ఉన్నాయని, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
కూడా తన అభ్యర్థిత్వాన్నే బలపరుస్తుందని ఆయన
అన్నారు. ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నత పదవిని స్వచ్ఛందంగా వదులుకొని గత
14 సంవత్సరాలుగా బిజెపి పార్టీలో కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ ప్రజాసేవకే అంకితమయ్యానని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా తనని గెలిపించి మరింత ప్రజాసేవ చేసే అవకాశం మహబూబ్ నగర్ ప్రజలు కల్పించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో మున్నూరు రమేష్, తమ్మలి ప్రాణేష్ శర్మ, మల్గారి విష్ణు గౌడ్,బ్యాగరి రమేష్,లోకిరేవు శీను, చెల్మె మహేష్,ఆవుల శేఖర్, కాముని పల్లి సురేష్ రెడ్డి, సి. దామోదర్, సి.వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version