6 కేజీల గంజాయి స్వాధీనం
జిల్లా ఎస్పి కిరణ్ ఖరే
భూపాలపల్లి నేటిధాత్రి
జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ మాట్లాడుతూ శనివారం ఉదయం 7 గంటలకు గంజాయి రవాణా గురించి నమ్మదగిన సమాచారం మేరకు ఎస్పి కిరణ్ ఖరే ఆదేశాలతో ఘన్పూర్ ఎస్ఐ సాంబమూర్తి తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్లి వాహనాల తనిఖీ చేస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనబడగా, వారిని కస్టడీలోకి తీసుకొని విచారించగా వారి వద్ద ఒక బ్యాగు ఉండగా, అందులో దాదాపు 1/2 కేజీ గంజాయి కనిపించగా, వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా, తదుపరి వారు నివాసముంటున్న అద్దె గది గాంధీనగర్ క్రాస్ కి వెళ్లి తనిఖీలు చేపట్టగా అట్టి గదిలో వీరు దాచిపెట్టిన మరో ఐదున్నర కేజీల గంజాయి మరియు మరో నిందితుడుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మీరు బీహార్ చెందిన వారిగా గుర్తించామన్నారు. దాదాపుగా ఆరు నెలల ప్రాంతం నుండి ఇక్కడ చెల్పూర్ లోని రైస్ మిల్లులో పని కోసం వచ్చి జల్సాలకు అలవాటు పడి అట్టి పనిచేస్తున్న డబ్బులు సరిపోకపోవడంతో మీరు గతంలో పరిచయం ఉన్న ప్రదీప్ అనే వ్యక్తికి కాంటాక్ట్ అయ్యి అతని వద్ద గంజాయి కొనుగోలు చేస్తూ ఇక్కడకు తీసుకువచ్చి ఎక్కువ రేట్లకు అమ్ముతూ అలా వచ్చిన డబ్బులతో జల్సాలకు అలవాటుపడ్డారనీ విచారణలో ఒప్పుకున్నారు.తదుపరి పంచుల సమక్షంలో పంచనామా నిర్వహించి సీజ్ చేసిన 6 కేజీల గంజాయినీ మరియు ముగ్గురు వ్యక్తుల్ని పోలీస్ స్టేషను కి తీసుకొచ్చి కేసు నమోదు చేయనైనది. ఒకరు పరారీలో ఉన్నారు. ఇట్టి నిందితుల వివరాలు
గణేష్ టాకుర్ కూలి పని (రైస్ మిల్లు),గౌరీ గ్రామం, పర్కండి హిస్సా మండలం, నలందా జిల్లా, బీహార్ మింటు కుమార్ తండ్రి పేరు రాంప్రీత్ పాశ్వాన్, 26 సం గౌరీ గ్రామం, పర్కండి హిస్సా మండలం, నలందా జిల్లా, బీహార్
చందన్ పాశ్వాన్ తండ్రి పేరు జోగిందర్ పాశ్వాన్, గౌరీ గ్రామం, పర్కండి హిస్సా మండలం, నలందా జిల్లా, బీహార్ 4. ప్రదీప్ ఉత్తరప్రదేశ్ (పరారీలో ఉన్నాడు)
ఈ సందర్బంగా ఎస్పీ కిరణ్ ఖరే మాట్లాడుతూ గంజాయి నియoత్రణకు ప్రజలు సహకరించాలని, పూర్తి స్థాయిలో నియంత్రించుటకు జిల్లా పోలీసు యంత్రాంగం కష్టపడుతుందనీ, గంజయిపై ప్రత్యేక నిఘా పెట్టి గంజా నిర్మూలనకు కృషి చేస్తుందనీ, గంజాయి సంబందించిన ఏ సమాచారం ఉన్నా డయల్ 100 ద్వారా గాని స్థానిక పోలీసు అధికారికి చేరవేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.*ఇట్టి ఆరు కేజీల గంజాయి పట్టుకోవడoలో ఉత్తమ విధులు నిర్వర్తించిన భూపాలపల్లి డిఎస్పి ఏ.సంపత్ రావు, చిట్యాల సిఐ డి.మల్లేష్ ఎస్సై ఘనపూర్ సాంబమూర్తి సిబ్బంది నేతాజీ.శ్రీనివాసులు ను ఎస్పి కిరణ్ ఖరే ప్రత్యేకంగా అభినందించి, రివార్డు ప్రకటించారు.