నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు
వీణవంక,( కరీంనగర్ జిల్లా):
నేటి ధాత్రి:వీణవంక మండల పరిధిలోని గన్ముకుల గ్రామంలో సోమవారం గణపతుల ఊరేగింపు ఉత్సవాలను భక్తులు గ్రామంలో వీధి దీపాలు లేక చీకట్లో చేసుకోవాల్సి వచ్చిందని, భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో స్పెషల్ ఆఫీసర్ పాలనతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడిందని, కనీసం విద్యుత్ దీపాలు పండుగ పూట లేకపోవడం ఏంటని, భక్తులు ఆగ్రహానికి లోనవుతున్నారు. గణపతి ఉత్సవాల వేళ వీధి లైట్లు లేకపోవడం దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నాయని, తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, మండల అధికారులు గ్రామంలో వెంటనే వీధిలైట్లను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.