లక్షట్ పేట్ మంచిర్యాల నేటిధాత్రి:
బార్ ఆసోసియేషన్ ఎన్నికల్లో 36 ఓట్లు పోలింగ్ నమోదు కాగా అధ్యక్షునిగా పోటీ చేసిన గడికొప్పుల కిరణ్ కు 19 ఓట్లు రాగా అక్కల శ్రీధర్ కు 17 ఓట్లు పోలయినాయి. దీంతో రెండు ఓట్లు మెజారిటీతో గడికప్పుల కిరణ్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నిక అయినారు.ఈ ఎన్నికలలో జాయింట్ సెక్రటరీగా న్యాయవాది నలినీకాంత్ విజయం సాధించారు. న్యాయవాది నలినీకాంత్ కు 25 ఓట్లు సాధించగా, న్యాయవాది తిప్పని రవికి 10 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు చెల్లలేదు. ఈ సందర్భంగా అధ్యక్షునిగా ఎన్నికైన గడికప్పుల కిరణ్ మాట్లాడుతూ బార్ అసోసియేషన్ అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు.
బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షునిగా విజయం సాధించిన గడికొప్పుల కిరణ్
