# తాత్కాలిక మరమ్మతులైన చేయాలని ప్రజల వేడుకోలు
జైపూర్,నేటిధాత్రి:
నిధులు మంజూరైన రోడ్లు మరమ్మతులకు మాత్రం నోచుకోకుండా మందమర్రికి వెళ్ళే ప్రధాన రహదారి ఆమడదూరంలో ఉందిపోతున్నది.
జైపూర్ మండలంలోని రసూల్ పల్లి గ్రామం నుండి ఆదిలిపేట్ గ్రామం మీదుగా మందమర్రి వరకు వెళ్లే ప్రధాన రహదారి ముదిగుంట మధ్యలో రెండు కల్వర్టులు పూర్తిగా శిథిలవస్థలో చేరుకున్నాయి. వర్షాకాలం వస్తే ఎటువైపు నుంచి వచ్చే వాహనాలు అటే నిలిచిపోతున్నాయి.ఈ కల్వర్టుల నిర్మాణ పనులు చేయకపోవడం వలన నిత్యం రహదారి భారీగా గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.రహదారి వెంట ప్రయాణించే వాహనదారులు,ప్రజలకు ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వం వాటి మరమ్మతు అభివృద్ధి నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు మొదలు కాకపోవడంతో పలువురు ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.నేటికీ అభివృద్ధికి నోచుకోలేకేపోవడంతో తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు,వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు చేయించాలని ఆయా గ్రామాలలో పాటు మండల ప్రజలు కోరుకుంటున్నారు.
# నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి..
# ఆదిలిపేట్ గ్రామం మీదుగా మందమర్రి వరకు వెళ్లే ప్రధాన రహదారి ముదిగుంట మధ్యలో రెండు కల్వర్టులు శిథిలావస్థకు చేరుకొని వరద నీరు వెళ్ళడం వలన రోడ్డు ద్వంసం అయ్యి గుంతలుగా మారాయని దీంతో ఆ ప్రదేశాలలో నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని ముదిగుంట గ్రామానికి చెందిన సోతుకు పోచం తెలిపారు.