వనపర్తి నేటిధాత్రి
పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి గ్రామంలో 10 రోజుల నుండి మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని మాజీ ఎంపిటిసి బాలస్వామి లక్ష్మణ్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు . గ్రామసభలో గ్రామ అభివృద్ధి గురించి స్పెషల్ ఆఫీసర్ గ్రామంలో పైపులై లైన్ ఇతర అభివృద్ధి పనులు చేసుకోవడానికి దాతలు ముందుకు వస్తే ప్రభుత్వ నుండి బిల్లులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారని బాలస్వామి తెలిపారు తక్షణమే ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి ఎమ్మెల్యే మేగారెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామంలో .బోర్లు వేయించి. మంచినీటి ఎద్దడి లేకుండా నివారించాలని వారు కోరారు గ్రామంలో ఒక వ్యవసాయ పొలం బోరు నుండి పైపులైన్ ద్వారా వాటర్ ట్యాంకు కు అనుసంధానం చేశారని గ్రామ ప్రజలకు నీళ్లు సరిపోవడం లేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు గ్రామ ప్రజలకు మిషన్ భగీరథ నీళ్లు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు .మంచి నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకుని నీటి సరఫరా చేయాలని లేనిచో గ్రామస్తుల ఆధ్వర్యంలో కాళీ బిందె లతో ధర్నా చేపడతామని వారు పేర్కొన్నారు