కూకట్పల్లి, ఫిబ్రవరి 03 నేటి ధాత్రి ఇన్చార్జి
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సంద ర్భంగా రాందేవ్రావ్ ఆసుపత్రి సర్వై కల్ క్యాన్సర్ వ్యాక్సిన్ కార్యక్రమంలో భాగంగా రాందేవ్ రావు ఆసుపత్రి దత్తత తీసుకున్న పాఠశాలలలోని 9 నుండి 15 సంవత్సరంలోపు ఉన్న బాలికలకు సర్వైకల్ క్యాన్సర్ నివా రణ కోసం ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ప్రతి బుధవారం, శనివారము నిర్వహిస్తున్న ఈ కార్య క్రమంలో భాగంగా 18 నుండి 45 సంవత్సరాల లోపు ఉన్న రాందేవ్ రావు ఆసుపత్రి సిబ్బందికి కూడా ఉచితంగా మూడు డోసుల సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వ డం జరిగింది. ఇలాంటి మంచి కా ర్యక్రమం చేపట్టడంతో బాచుపల్లికి చెందిన మెరుగుసుచరిత అను ఆమె తన తల్లి విజయ వాణి, పిల్లలు నిషిత్,నియతి పేర్ల మీద, ఇలాంటి సేవలు మరి కొంతమందికి చేరాలని 60 వేల రూపాయలను రాందేవ్ రావ్ ఆసుపత్రి యాజమా న్యానికి విరాళంగా అందజేశారు.ఈ సందర్భంగా రాందేవ్ రావు ఆసుప త్రి యాజమాన్యంతో పాటు డాక్టర్ ఛాయాదేవి విరాళం అందజేసిన మెరుగు సుచరితకు,ఆమె కుటుం బాన్ని అభినందించి,ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.