మంచిర్యాల జిల్లా నేటిదాత్రి
మంచిర్యాల లోని గర్మిళ్ళ లయన్స్ క్లబ్ మరియు రేకుర్తి కంటి ఆసుపత్రి, కరీంనగర్ వారు సంయుక్తంగా ఉచిత నేత్ర వైద్య చికిత్స శిభిరంను తేది. 13.10.2023 శుక్రవారం నాడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మంచిర్యాలలోని రాంనగర్ లో గల నారాయణ హై స్కూల్ లో నిర్వహిస్తున్నట్లు గర్మిళ్ళ లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ మోదుంపురం వెంకటేశ్వర్, క్లబ్ డైరెక్టర్ లయన్ గాజుల ముకేశ్ గౌడ్ గారలు తెలిపారు.
ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ కంటి చూపులో లోపాలు, మోతెబిందు, కంటిలో శుక్లాలు ఉన్నవారిని గుర్తించి, కంటి ఆపరేషన్ అవసరం ఉన్న వారిని వెంటనే ఉచితంగా బస్సు సౌకర్యం తో రేకుర్తి ఆసుపత్రి కి తీసుకువెళ్లి ఉచితంగా కంటి ఆపరేషన్ చేసిన వారిని మరల మంచిర్యాల కు తీసుకువస్తారు అని తెలియజేశారు. శిభిరానికి వచ్చేటపుడు మీ ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీలు వెంట తీసుకురావాలని తెలిపారు. ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని కోరారు..
ఈ కార్యక్రమంలో రీజియన్ చైర్మన్ లయన్ సుగుణాకర్ రెడ్డి, జోన్ చైర్మన్ లయన్ సద్దనపు రాంచందర్, క్లబ్ డైరెక్టర్ లు లయన్ వంగల సంపత్ కుమార్, లయన్ శ్రీరామోజు రమేష్ బాబు, లయన్ కొంకుముట్టి వెంకటేశ్వర్లు, కార్యదర్శి లయన్ రాఘవేందర్ రావ్, కోశాధికారి లయన్ బల్లు శంకర్ లింగం తదితరులు పాల్గొన్నారు.