వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ సత్య సాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో క oటి వైద్యులు డాక్టర్ పొదిలి శ్రీధర్ 150 మందికి కంటి పరీక్షలు చేశారని వనపర్తి శ్రీ సత్య సాయి సేవ సంస్థ కన్వీనర్ రమేష్ రెడ్డి ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు .మొత్తం 150 మంది కంటి పరీక్షలు చేయించుకున్నారని అందులో 85 మందికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేశామని 45 మందికి కంటి ఆపరేషన్లు అవసరమని వారికి శ్రీ సత్యసాయి సేవా సంస్థ తరపున ఉచితంగా హైదరాబాదులో ఎలాంటి రవాణా ఖర్చులు లేకుండా ఆపరేషన్లు నిర్వహించి ఇంటికి పంపుతామని ఆయన పేర్కొన్నారు