హసన్ పర్తి/ నేటి ధాత్రి
కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో గతంలో ఎస్సై గా పనిచేసి ప్రస్తుతం సీ ఐ గా భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న పోలీసు అధికారిపై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు అయినట్లు సమాచారం. 2022లో కేయూ పి ఎస్ లో ఎస్ ఐ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు అధికారి స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం. ఈ విషయంలో మహిళ భర్త పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా ఏ ఆర్ కు అటాచ్ చేసినట్లు తెలిసింది. అనంతరం సీ ఐ గా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు అటు నుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన సదరు అధికారి ఆ మహిళ తోనే సన్నిహిత సంబందం కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు మహిళ కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఇటీవల కే యు పి ఎస్ లో మహిళా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విచారణ చేసిన కేయూ పోలీసులు గురువారం సదరు అధికారిపై అత్యాచారయత్నం ఫోక్స్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.