మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
సోమవారం రోజు మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం రాజాపూర్ మండల కేంద్రము లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మంత్రి , ఎంపి, ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంగారెడ్డి గూడ నుండి రాజాపూర్ మండల కేంద్రానికి రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.మిడ్జిల్ మండలం లోని కొత్తపల్లి నుడి కొత్తూరు వరకు, బాలానగర్ నుండి గంగాపూర్ వరకు బిటి రోడు పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఎంపీ శ్రీమతి డి కె అరుణ, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ అనిరుధ్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జి.మధుసూధన్ రెడ్డి, మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, జిల్లా కలెక్టర్ శ్రీమతి విజయేందిర బోయి, ఎస్పీ శ్రీమతి డి జానకి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఆర్ బాలా త్రిపుర సుందరి, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.