శాయంపేట నేటి ధాత్రి;
శాయంపేటమండలంలోని పత్తిపాక గ్రామంలో పద్మశాలి భవన నిర్మాణానికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పద్మశాలి కులస్తులు ఒకచోట కూర్చొని వారి సమస్యలను పరిష్కరిం చుకోవడానికి ఈ భవనం తోడ్పడుతుందని అన్నారు. 10 లక్షల సి డి ఎఫ్ నిధులతో పాటు అదనంగా మరో 10 లక్షలు కేటాయించినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా పత్తిపాక నుండి ప్రగతి సింగారం వెళ్లే రైతుల సౌకర్యం కోసం 30 లక్షల నిధులతో కల్వర్టు నిర్మాణం చేపడతామని అలాగే సిసి రోడ్ల నిర్మాణం చేపడతా మని అన్నారు. అంతేకాకుండా అంబులెన్స్ ను త్వరలోనే మండల ప్రజలకు అందు బాటులోకి తెస్తామని తెలిపారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు దూదిపాల బుచ్చిరెడ్డి, చల్ల చక్రపాణి, చిట్టి రెడ్డి రాజిరెడ్డి, జంగారెడ్డి, రేణిగుంట్ల సదయ్య, చేనేత సహకార సంఘం అధ్యక్షులు గుర్రం రమేష్, పిఎసిఎస్ డైరెక్టర్ కందగట్ల ప్రకాష్, పద్మశాలి సంఘం అధ్యక్షులు కందగట్ల హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.