సకాలంలో స్పందించిన ఎమ్మెల్యే అభినందించిన గ్రామస్తులు
జైపూర్, నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం లోని మిట్టపల్లి గ్రామంలో చెన్నూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఎస్ డి ఎఫ్ నిధులతోని శనివారం రోజున మిట్టపల్లి గ్రామంలో రెండు బోర్ల కి శంకుస్థాపన చేయడం జరిగింది.
గ్రామంలోని నీటి సమస్యల గురించి వారికి తెలుపగానే నెలరోజుల వ్యవధిలోనే వారు మిట్టపల్లి గ్రామానికి రెండు బోర్లు ఇవ్వడం చాలా సంతోషకరమని మహిళలు, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
పది సంవత్సరాలలో గత ప్రభుత్వం చెన్నూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పైన ఏ రోజు కూడా పట్టించుకోకుండా వారు నిర్లక్ష్యం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రణాళిక బద్దంగా రూపొందించుకొని ఒక్కొక్కటిగా ప్రతి గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తూ అభివృద్ధి చేయడం జరుగుతుందని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేక్ మాట్లాడుతూ ఇప్పటికే మిట్టపల్లి గ్రామానికి 7 లక్షల రూపాయలతో సిసి రోడ్ నిర్మాణం చేపట్టడం జరిగిందని అలాగే రానున్న రోజుల్లో కూడా మిట్టపల్లి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి తమ సాయశక్తుల కృషి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధికారులు కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.