నివాళులర్పిస్తున్న జర్నలిస్టులు
మొగులపల్లి నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని కొర్కశాల మాజీ సర్పంచ్ అప్పం మల్లక్క మొదటి వర్ధంతి వేడుకలను తన భర్త అప్పం భీమయ్య, కుమారులు అప్పం రమేష్, అప్పం సాగర్ లు తన నివాసం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టులు అప్పం మల్లక్క చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆమె కలలు కన్నా కొర్కిశాల గ్రామ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జర్నలిస్టు యూనియన్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల మహేందర్ గౌడ్, సీనియర్ జర్నలిస్టు నిమ్మల సారయ్య, జర్నలిస్టులు క్యాతరాజు రజనీకాంత్, చెక్క శ్రీధర్, వేముల కిరణ్ గౌడ్, కట్కూరి ఐలయ్య, నిమ్మల భద్రయ్య, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నడిగోటి రాము, మొగుళ్ళపల్లి టౌన్ ప్రెసిడెంట్ క్యాతరాజు రమేష్, నాయకులు మణికర్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.