చిట్యాల, నేటిధాత్రి :
చిట్యాల మండలం, అందుకుతండా గ్రామ వాస్తవ్యులు సీనియర్ బిఆర్ఏస్ నాయకులు భూక్యా మోహన్ కుమార్తె కర్ణ వేదన కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అనంతరం చిట్యాల మండలం నైన్ పాక గ్రామంలోని బేతేస్త ప్రార్థన మందిరం నందు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని, శుభాకాంక్షలు తెలిపారు.
వారి వెంట ,చిట్యాల మండల పార్టి అధ్యక్షులు అల్లం రవీందర్ మాజీ జెడ్పిటిసి గొర్రె సాగర్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం క్రాంతి కుమార్ రెడ్డి నాయకులు మాజీ ఎంపీటీసీ లు కూర మైపాల్ రెడ్డి భూక్యా సుజాత గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి తిరుపతి నాయకులు మడికొండ రవీందర్రావు చిలుమల రమణాచారి కట్టేకొల్ల రాజు ఉప్పునూతల రాజేందర్ కైరిక రాజు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.