కూకట్పల్లి, ఫిబ్రవరి 02 నేటి ధాత్రి ఇన్చార్జి
మూసాపేట సర్కిల్ పరిధిలోని మూసాపేటలో మాజీ కార్పొరేటర్ ఇంటి నెం.12-4-73లో జి.హెచ్. ఎం.సి మంజూరు చేసిన అనుమ తులకు విరుధంగా నిర్మిస్తున్న అక్రమ నిర్మాణంపై ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసో సియేషన్ పేరిట ఉప్పు రామకృష్ణ కూకట్పల్లి జోనల్ కమిషనర్కి,డిప్యూటీ కమీష నర్కికు గురువారం నాడు పిర్యాదు చెయ్యడం జరిగింది. డిప్యూటీ కమీ షనర్ సానుకూలంగా స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకుం టామని తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పు రామకృష్ణ మాట్లాడుతూ ఇంటి నెం.12-4-73 లో రెండు అంతస్తులకు అనుమతులు తీసు కొని అక్రమంగా మూడో అంత స్తును నిర్మిస్తున్నారని, రోడ్డును ఆక్రమించి అధిక వైశాల్యంలో భవనాన్ని నిర్మి స్తున్నారని ఆరోపించారు. కాలని లోకి పెద్ద వాహనాల రాకపోకలకు ఈ అక్రమ నిర్మాణం అడ్డుగా ఉంద న్నారు. కె.పి.ఎం గ్రౌండ్లో ప్రతి సంవ త్సరం ఎంతో ఘనంగా నిర్వహించే వినాయక, దుర్గామాత నవరాత్రుల ఉత్సవాలకు ఈ అక్రమ నిర్మాణం వలన అంతరాయం కలిగే అవకాశం ఉందన్నారు. ఈ అక్రమ నిర్మాణంపై వెంటనే చర్యలు తీసుకోవాలని
జోనల్ కమిషనర్ కి పూర్తి ఆధా రాలతో పిర్యాదు చేసినట్టు పేర్కొ న్నారు.
ఫోటో నెంబర్ 1 లో….