చందుర్తి, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలోని టిఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ అధినేత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నాయకుడు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ అని తెలిపారు వారు ఆయురారోగ్యాలతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడు వారికి వారి కుటుంబానికి ఉండి రాష్ట్రంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు మరోసారి ముఖ్యమంత్రి కావాలని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని కోరుతున్నామని వారు తెలిపారు
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు మేకల ఎల్లయ్య, ఎంపీపీ బైరగొని లావణ్య రమేష్, వైస్ ఎంపీపీ మందాల అబ్రహం,సెస్ డైరెక్టర్ పొన్నాల శ్రీనివాసరావు, తిప్పని శ్రీనివాస్, బత్తుల కమలాకర్, డప్పుల అశోక్ లింగాల మల్లయ్య మూడపల్లి శ్రీనివాస్ మరాఠి మల్లిక్ మరియు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.