హసన్ పర్తి / నేటి ధాత్రి
లోకసభ ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీం (ఎఫ్ ఎస్ టి) ముమ్మర తనిఖీలో భాగంగా హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోని బైరాన్ పల్లి నుంచి సిద్దాపూర్ వెళ్లే రహదారుల్లో వాహనాలను ఆపి వివరాలను సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు వెహికిల్స్ చెక్ చేస్తూ ప్రజలకు కొన్ని సూచనలిస్తూ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రూ..50 వేల కంటే ఎక్కువ ఉంటే వాటికి సరియైన ఆధారాలు పత్రాలు ఉండాలనీ సూచించారు