సీనియర్ల సలహాల మేరకు, వరంగల్ ప్రెస్ క్లబ్ అడహాక్ కమిటి ఏర్పాటు.
వరంగల్లో ప్రత్యేక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాల్సిందే..
తూర్పు వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్
వరంగల్, నేటిధాత్రి
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని, మ్యూజికల్ గార్డెన్లో మంగళవారం వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ ఏర్పాటు కోసం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ తూర్పులో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అందరూ హాజరయ్యారు. అనంతరం సభ్యుల అభిప్రాయాలను తీసుకొని ఏకగ్రీవ తీర్మానాలను ఆమోదించారు. అనంతరం 21మందితో కూడిన అడహక్ కమిటి ఏర్పాటు చేసారు. దీంతొ పాటు గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో వరంగల్ తూర్పు నుండి ఎన్నుకోబడిన ఆరుగురు కమిటి సభ్యులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా తీసుకున్నారు. ఆలస్యం అయిన కానీ చివరికి వరంగల్ లో “నూతన ప్రెస్ క్లబ్” ఏర్పాటుకు ఎట్టకేలకు తొలి అడుగు పడింది అనే చెప్పొచ్చు. సీనియర్ల సలహాల మేరకు, రాబోయే రోజుల్లో తీసుకునే నిర్ణయాలను అందరినీ కలుపుకొని వరంగల్ ప్రెస్ క్లబ్ అడహాక్ కమిటి ఏర్పాటు చేసుకున్నారు. వరంగల్లో ప్రత్యేక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాల్సిందే అంటూ తూర్పు వర్కింగ్ జర్నలిస్టులు ముక్త కంఠంతో తెలియచేసారు. అడహక్ కమిటీలో సభ్యులుగా కొందరు సీనియర్ జర్నలిస్టులను ఎంపిక చేయక పోవడంతో వారు బహిరంగంగానే అడహక్ కమిటీని వ్యతిరేకిస్తున్నాం అని తెలుపడం కొసమెరుపు. కొందరు ఒంటెద్దు పోకడ ప్రదర్శించడం, అంతా తామే అంటూ మాట్లాడే ప్రవర్తన,తోటి జర్నలిస్టులను చులకనగా చూడటం సమంజసం కాదని కొందరు జర్నలిస్టుల అభిప్రాయం. ప్రెస్ క్లబ్ ఏర్పాటు కాకముందే అప్పుడే లాభియింగ్ లు చేస్తూ, ప్రెస్ క్లబ్ ఏర్పాటు అయ్యే వరకు కూడా ఆగకుండా ఒకరికొకరు వ్యక్తిగత ఆరోపణలకు పోవడం చూస్తే, మున్ముందు ఏమి జరుగుతుందో వేచి చూడాలి.. ఏది ఏమైనా వరంగల్ ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అందరినీ కలుపుకొని ముందుకు సాగడం మంచిది అని మరికొందరి అభిప్రాయం.