రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని సివి రామన్ పాఠశాలలో 15 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా సేవలందించి ఎంతో మంది విద్యార్థిని, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిన కొత్వాల్ సురేందర్ ఇటీవల అనారోగ్య కారణాలతో మరణించగా, విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడు మరణించిన విషయాన్ని తెలుసుకున్న పూర్వ విద్యార్థులు వారి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించారు. పూర్వ విద్యార్థులు సుమారు 1,25,000 వేల రూపాయలు జమ చేసి మృతి చెందిన ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులకు అందించారు. మరణించిన ఉపాధ్యాయుడి సేవలను గుర్తించి వారి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ గురజాల రవీందర్రావు, హెడ్మాస్టర్ కనుకుంట్ల సురేందర్ రావు లు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సివి రామన్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా పనిచేసిన పెద్దపెల్లి ఉప్పలయ్య సైతం పాల్గొన్నారు.